Telangana

జూబ్లీహిల్స్ లో ‘ఫెస్టివోగ్’ డిజైనర్ స్టోర్ ను ప్రారంభించిన సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ‘ఫెస్టివోగ్’ భారతీయ లగ్జరీ చేనేత, కౌట్యూర్ ను సినీ తారలు శ్రియ శరణ్, మంచు లక్ష్మి, నవదీప్ కలిసి ప్రారంభించారు.అమెరికాలో దాదాపు పదేళ్లుగా భారతీయుల విశ్వాసాన్ని పొందిన ప్రీమియం లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోగ్ . అమెరికా వెలుపల ప్రారంభమైన తొలి స్టోర్ ఇదే కావడం విశేషం. అరుదైన చేనేత వస్త్రాలు, పెళ్లి వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ కలెక్షన్లు, కౌట్యూర్ దుస్తులను హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులోకి తెచ్చారు.అమెరికాలోని డల్లాస్‌లో ఫెస్టివోగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ దేశంలోని అతిపెద్ద భారతీయ బ్రైడల్ బుటిక్‌లలో ఒకటిగా పేరొందింది. వివాహాలు, శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల కోసం ప్రత్యేకమైన దుస్తులను కోరుకునే వినియోగదారులకు ఇది ప్రముఖ కేంద్రంగా నిలిచింది.

ఇప్పుడు హైదరాబాద్ స్టోర్‌లో అరుదైన చేనేత చీరలు, బ్రైడల్ చీరలు, డిజైనర్ లెహంగాలు, కౌట్యూర్ కలెక్షన్లు, పురుషుల సంప్రదాయ దుస్తులు, కుర్తా సెట్లు, పిల్లల ప్రత్యేక దుస్తులు తదితర విభాగాల్లో ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.సంస్థ వ్యవస్థాపకురాలు భావనా ధనేకుల, భాగస్వామి సింధు కొసరాజు మాట్లాడుతూ, భారత్‌లో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయాన్ని, ఆధునికతను సమన్వయం చేసుకున్న హైదరాబాద్ నగరంలో ప్రత్యేక చేనేత, నాణ్యమైన కళాత్మక దుస్తులకు విశేష ఆదరణ ఉందని, అందుకే తొలి భారతీయ స్టోర్‌ను ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.జూబ్లీహిల్స్‌లోని ఈ స్టోర్‌తో ఫెస్టివోగ్ భారతీయ లగ్జరీ ఫ్యాషన్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, ప్రత్యేకమైన వేడుకల కోసం అరుదైన, విలాసవంతమైన వస్త్రాలను కోరుకునే వారికి ఇది ప్రీమియం గమ్యస్థానంగా నిలుస్తుందని వారు తెలిపారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago