మనవార్తలు ప్రతినిధి , జిన్నారం :
గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని త్వరలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం ఉదయం ఖాజిపల్లి పరిధిలోని జిఎంఆర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సర్వేనెంబర్ 181 లో ప్రజల సౌకర్యార్థం గుడి, మసీదు, చర్చి, స్మశాన వాటిక, అంగన్వాడి, చట్ పూజ ఘాట్, క్రీడా మైదానం, ప్రాథమిక పాఠశాల నిర్మాణాలకు త్వరలో స్థలాలు కేటాయించి..భవన నిర్మాణాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిఎంఆర్ కాలనీలో గ్రామ దేవత గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుష్మ శ్రీకాంత్, తహసిల్దార్ ఆంథోనీ, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
