అడగకుండానే జగనన్న వరాలు
నాదెండ్లలో ఘనంగా వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభం
గుంటూరు జిల్లా
మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం తమదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. మండల కేంద్రం నాదెండ్లలో వైఎస్సార్ భరోసా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వరాలిస్తాడని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు అడగకుండానే ఎన్నో వరాలు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పుడు దసరా కానుకగా రాష్ట్రంలోని సుమారు 90 లక్షల మంది మహిళామ తల్లులకు ఆర్థిక లబ్ధి చేకూర్చబోతున్నారని చెప్పారు.
వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సుమారు 9 లక్షల డ్వాక్రా సంఘాల రుణమాఫీ రెండో దఫా మొత్తాలను ఈ రోజు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి మన ప్రభుత్వం జమ చేస్తున్నదని చెప్పారు. మహిళల కోసం మన ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. పసిపిల్లల దశ నుంచి అవ్వల వరకు అన్ని వయసుల వారికి ఏదో ఒక పథకాలు నేడు మన రాష్ట్రంలో మగువల కోసం అమలవుతూనే ఉన్నాయని తెలిపారు.
_మహిళలందరికీ మన ప్రభుత్వ ఒక గర్వకారణం
ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ మన రాష్ట్రంలో తల్లిబిడ్డలకు పౌష్టికాహారం అందించడం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అమలవుతోందని చెప్పారు. ఆరేళ్ల పిల్లల నుంచి ఇంటర్ వరకు పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం అమలవుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాలకే నేరుగా మన ప్రభుత్వం ఏటా రూ.15,000 నగదు అందజేస్తున్న విషయం మనందరికీ తెలుసని చెప్పారు. ముఖ్యంగా 45 ఏళ్లు నిండిన మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చేలా వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తమ ప్రభుత్వ అమలుచేస్తున్నదని తెలిపారు. ఈ పథకాల ద్వారా పెద్ద మొత్తంలో ఆడపడుచుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నదని చెప్పారు. మహిళల సాధికారత కోసం ఇంతగా పరితపిస్తున్న ప్రభుత్వాలు ఈ దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేవని ఒక మహిళా శాసనసభ్యురాలిగా నేను సగర్వంగా చెబుతున్నానని ఆనందం వ్యక్తంచేశారు. మహిళలందరికీ మన ప్రభుత్వం ఒక గర్వకారణమని స్పష్టంచేశారు.
అర్హులందరికీ వైఎస్సార్ ఆసరా
ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారని చెప్పారు. అర్హత ఉన్నా పొరపాటున ఆ జాబితాల్లో పేర్లు మిస్ అయిన సంఘాలు ఏవైనా ఉంటే, వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విచారణ చేపట్టి వెంటనే వారికి కూడా రుణాలు మంజూరు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో
డిపిఓ కేశవరెడ్డి,ఏరియా కో ఆర్డినేటర్ హనుమా నాయక్,ఎంపీడీఓ మోషే,ఏపీఎం భరత్,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ తలతోటి రాణి,కో ఆప్షన్ సభ్యులు షేక్ మూసా ఇస్లాం,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు,కాండ్రు శేషయ్య, మస్తాన్ వలి,యల్లారావు,వెంకటేష్ ,నరసింహారావు,నెల్లూరి వెంకయ్య మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…