Telangana

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ లో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం – 2023ని పురస్కరించుకుని ‘ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్ర’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సింపోజియాన్ని సోమవారం నిర్వహించారు. ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలను కూడా ఈ సందర్భంగా జరుపుకున్నారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గణనీయమె క్రృషిచేసిన ఫార్మసిస్ట్లను గౌరవించేందుకు ప్రతియేటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హెటిరో డ్రగ్స్ సీడీఎంఏ ఫార్మకోనిజిలెన్స్ గ్లోబల్ హెడ్ డాక్టర్వెశ్రీధర్రెడ్డి, క్లినోసోల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.ఎస్. ముజీబుద్దీన్ పాల్గొని, వర్ధమాన ఫార్మసిస్టులకు పరిశ్రమపై విలువైన అంతరస్తులను అందించారు.ఫార్మసిస్ట్ సమగ్రాభివృద్ధి ప్రాముఖ్యతను డాక్టర్ శ్రీధర్ రెడ్డి నొక్కి చెప్పారు. చదివే పాఠ్యాంశాలపై పట్టు,సాధించి, పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. పరిశ్రమ,చికిత్సా రంగాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని, ఆయా సంస్థలను అర్థం చేసుకుని, ఆధునికతను అందిపుచ్చుకోవాలన్నారు.

ఔషధ పరిశ్రమ వృద్ధి సామర్థ్యం గురించి చెబుతూ, 2030 నాటికి ఆ పరిశ్రమ విస్తరణ 130 కోట్లకు పెరుగుతుందని ముజీబుద్దీన్ అంచనా వేశారు. క్లినికల్ డేటా సైన్స్, మెడికల్ మానిటరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, కృ త్రిమ మేథ ఆధారిత క్లినికల్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో పెరుగుతున్న అవకాశాలతో పాటు ఫార్మసిస్ట్గా నిర్వహించాల్సిన వివిధ విధులు, పెంపొందించుకోవాల్సిన సామర్థ్యాలను ఆయన వివరించారు,తొలుత, అతిథులు ఇద్దరినీ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ స్వాగతించి, సత్కరించారు.సింపోజియం నిర్వాహకురాలు డాక్టర్ హెన్లు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. డాక్టర్ శ్రీకాంత్ పొడిన అన్నమయ్య కృతి, స్వప్నిక నృత్యం ఆవుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ -ప్లాస్టర్, పంటల పండుగ, నృత్యం, వృక్షృత్వం, క్విజ్, క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago