Telangana

జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_నియోజకవర్గ పరిధిలోని వంద మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

_ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులది కీలకపాత్ర

_పటాన్చెరు నియోజకవర్గం జర్నలిస్టులు అదృష్టవంతులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తూ, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు.

గురువారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో..పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో పనిచేస్తున్న 100 మంది జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి తోఎమ్మెల్యే జిఎంఆర్ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. వీరితోపాటు కాజిపల్లి గ్రామానికి చెందిన 30 మంది రోడ్డు నిర్వాస బాధితులకు పట్టాలను అందచేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా మూలంగా మీడియా వార్త కథనాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కథనాలు ఉండాలని కోరారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే వార్తల ద్వారా తెలియచేయాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 68 ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.మొదటి విడతగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, రెండో విడతలో అర్హులై ఉండి అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూములు అందజేస్తామని హామీ ఇచ్చారు.పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేస్తున్న సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. గత సంవత్సరం 60 లక్షల రూపాయల సొంత నిధులతో వందమంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని గుర్తు చేశారు.. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలిత సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కార్పొరేటర్లు పుష్ప నగేష్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, ఆయా మండలాల తహసిల్దార్లు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండలాల, డివిజన్ల అధ్యక్షులు అఫ్జల్, రాజేష్, షేక్ హుస్సేన్, దేవేందర్ యాదవ్, పాండు, అయ్యా గ్రామాల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago