Telangana

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో పండుగ సీజన్ ను స్వాగతించింది. క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ నేతృత్వంలో ఆతిథ్య విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమం, క్రిస్మస్ యొక్క వెచ్చదనం, స్ఫూర్తిని జరుపుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులందరినీ ఒకచోట చేర్చింది.ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడే సంప్రదాయమైన కేక్ మిక్సింగ్ వేడుక ఆశ, ఆనందం, కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. గీతంలో, ఈ వేడుక ఒక పాక శాస్త్ర ఆచారానికి మించి జరిగింది. ఎండిన పండ్లు, గింజలు (నట్స్), సుగంధ ద్రవ్యాలు, వివిధ రసాల ఉల్లాసమైన మిశ్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చేతులు కలిపారు. కృతజ్జత, ఐక్యతను ప్రతిబింబించే గొప్ప పండుగ కేక్ లను తయారు చేయడానికి ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు ఊరబెడతారు.‘సమాజం, భావోద్వేగం, భాగస్వామ్యం యొక్క ఆనందాన్ని ఈ వేడుక సూచిస్తుంది’ అని అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. ‘కేక్ అనేది ప్రేమతో తయారు చేసిన తినదగిన పదార్థం. ఐక్యత, స్నేహం, పండుగ ఉత్సాహాన్ని ఈ వేడుక ప్రతింబిస్తుంద’ని ఆమె అన్నారు.ఈ కేక్ మిక్సింగ్ వేడుక ద్వారా ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించినట్టయింది. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, డైరెక్టర్-స్కూల్ ఆఫ్ టెక్నాలజీ & డీన్-కోర్ ఇంజనీరింగ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఆతిథ్య బృందంతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద ఇది వేడుకల స్ఫూర్తిని పెంచడమే గాక, ఈ సీజన్ లోనే చిరస్మణీయమైన కార్యక్రమంగా నిలిచిపోయింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago