Telangana

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు

ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట

మానసిక ఒత్తిడి లేని విద్యను అందించడమే రామయ్య ఆశయం

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఐఐటి రామయ్య ఆశయాలకను గుణంగా ఇష్టా విద్యాసంస్థలను తీర్చి దిద్దామని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట అన్నారు. గురువారం ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 100వ పుట్టినరోజు వేడుకలు ఇష్టా విద్యాసంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్సీ,అన్ని వర్గాల పేద విద్యార్థులకు ఐఐటీని పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ ఐఐటి చుక్కా రామయ్య జన్మదిన వేడుకలను ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో బీరంగూడ, పటేల్ గూడ, సంగారెడ్డి, మరియు పటాన్ చెరు బ్రాంచ్ ల లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.అనంతరం ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్, ఇష్టా విద్యాసంస్థల అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్ లు ఐఐటి చుక్కారామయ్య నివాసంలో రామయ్యను కలిసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఐఐటి చుక్కారామయ్య 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జీవితంలో సాధించిన ఎన్నో గొప్ప విషయాలను గుర్తు చేస్తూ ఇష్టా విద్యాసంస్థలను ఆయన ఆశయాలకు తగ్గట్టుగా తీర్చి దిద్దామని తెలిపారు ఈనాటి విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేని విద్యను అందించడమే ఆయన లక్ష్యం అని పేర్కొన్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా ఇష్టా విద్యా సంస్థల యాజమాన్యం ఎల్లప్పుడు కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇష్టా విద్యాసంస్థల సంగారెడ్డి బ్రాంచ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి కిరణ్ రెడ్డి, పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ రజిత, వైస్ ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ రెడ్డి, బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ తులసి, వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ ,విజన్ స్కూల్ ప్రిన్సిపల్ ఇబ్రహీం మరియు ఇష్టా విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్ లు రమేష్ ,వెంకట్ రెడ్డి అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago