Telangana

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రమశక్తి నీతి-2025 సెమినార్ కి చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ ఈ లేబర్ పాలసీతో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతున్నదని, సమిష్టి బేరసారాల హక్కును హరించి, ఐఎల్ ఓ ను బైపాస్ చేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. దేశంలో కార్మికశక్తిని ఐక్యం కానీయకుండా కార్పొరేట్ల రాజ్యంలా మార్చడానికి ఈ శ్రమశక్తి నీతి 2025 ఉపయోగపడుతుందని, మన రాజ్యాంగంలో కార్మికులకు కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, శ్రమకు గౌరవం వంటి విలువలకు పూర్తి విరుద్ధమని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మూల కారణమైన కార్మికవర్గ హక్కులపై యూనియన్ల తో చర్చించకుండా ఏకపక్షంగా అమలుచేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలని, ఈ అంశంపై కార్మికవర్గమంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధంకావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. మనోహర్, ఎ. వీరారావు, ఎమ్. సత్తిబాబు, వివిధ కమిటీల సభ్యులు, మాజీ ఆఫీస్ బేరర్స్, మాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago