మనవార్తలు,పటాన్ చెరు:
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు .
డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని వెల్లడించాలని ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎంత మంది పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారని నిరుపేదలైన స్థానికులకు మరియు దశాబ్దాలుగా స్థానికంగా స్థిరపడిన నిరుపేదలకు అందించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఎప్పుడు అందుబాటులోకి తేస్తారో రాష్ట్ర ప్రజలకు తెలపాలని లేదంటే డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు పెద్ద ఎత్హున ఉద్యమిస్తామని గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, శ్రీనివాసగుప్త అసెంబ్లీ కన్వీనర్, దేవేందర్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, బైండ్ల కుమార్ జిల్లా కార్యాదర్శి, శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి, పుణ్యవతి మహిళ మోర్చా జిల్లా, జన్సీ మండల నాయకురాలు, జగన్ రెడ్డి, బాలచారీ, మధుకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…