పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్-విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్’ అనే అంశంపై జనవరి 21, 2023న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 4.00 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు.తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.గ్లాస్గో (స్కాట్లాండ్)లోని స్ట్రాక్లైడ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టభద్రురాలు, విద్యావేత్త, ప్రముఖ రూపశిల్పి కృష్ణకోళి దత్తా ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు.ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl.li/csbjt ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చని, ఇతర వివరాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధా రాయ్ sroy2@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…