_పల్లె పల్లె నా ఎగిరిన గులాబీ జెండా..
_గులాబీమయంగా మారిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్..
_వేలాదిగా తరలివచ్చిన నాయకులు..కార్యకర్తలు
_ఔర్ ఏక్ బార్ జీఎంఆర్ అంటూ మోగిన నినాదాలు.
_బైక్ ర్యాలీలతో తరలివచ్చిన యువత..
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజా నాయకుడు పిలుపునిస్తే జన ప్రభంజనం ఎలా ఉంటుందో పటాన్చెరులో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల మహాసభ నిదర్శనంగా నిలిచింది.పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల మహాసభకు వేదికగా నిలిచిన జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ గులాబీ ప్రభంజనం గా మారింది.పల్లె పట్నం అని తేడా లేకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలు, కాలనీలలో పండగ వాతావరణం లో పటాకులు కాలుస్తూ గులాబీ జెండాలను ఎగురవేసి.. ర్యాలీలుగా బయలుదేరి జిఎంఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల మహాసభకు చేరుకున్నారు.వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో.. శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ లాటి దెబ్బలకు, నిర్బంధాలకు వెరవకుండా 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నేడు దేశానికి దిక్సూచిగా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలులో l రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.నాటి ప్రత్యేక తెలంగాణ పోరాటంలో.. నేడు బంగారు తెలంగాణ సాధనలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం బలగమన్నారు. మీరందరూ ఇచ్చిన సంపూర్ణ సహకారంతోనే తాను నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.కార్యకర్తల శ్రమ, నిజాయితీ, పట్టుదల మూలంగానే ప్రతి ఎన్నికల్లోను విజయ దుందుభి మోగిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని అన్నారు. కార్యకర్తలు రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు.గత ప్రభుత్వాల హాయంలో ఎటు చూసినా బీడు భూములు, రైతుల ఆత్మహత్యలు, పరిశ్రమల మూసివేతలు, చిమ్మ చీకట్లు, నెర్రలు బారిన పొలాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారిని.. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికి రక్షిత మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మూడు షిఫ్టుల్లో పరిశ్రమల నిర్వహణ, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు, పెరిగిన భూముల ధరలు, కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రతో ప్రతి తెలంగాణ బిడ్డ ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.
మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవడంతో పాటు.. ప్రతి ఒక్కరి అభివృద్ధి సంక్షేమమే కేంద్రంగా పనిచేస్తున్నామని తెలిపారు.9 ఏళ్ల హయాంలో 8 వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. అడిగిందే తడువుగా అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తూ.. పల్లెలను పట్నాలకు దీటుగా తీర్చిదిద్దామని తెలిపారు.అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా పనులు చేపడుతున్నామని అన్నారు.పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సమున్నత లక్ష్యంతో.. బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయడంతో పాటు పటాన్చెరువు పట్టణంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా గృహలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు.
ఒక వైపు అనునిత్యం అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉనికి కోసం పోరాటం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు..గంగా జమున తేహజీబ్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే తెలంగాణలో బిజెపి పార్టీ అధికారం కోసం మతతత్వ రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు.దేశంలో రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని అందించాల్సిన లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ప్రారంభించారని.. అభ్ కి బార్ కిసాన్ సర్కార్ రాబోతుందని అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంపపెట్టులా వారి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పును ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…