Telangana

చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు

సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్

చిన్నారుల ఆనందమే నిజమైన పండుగ

ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ సేవా సంప్రదాయం*

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఎండీఆర్ ఫౌండేష‌న్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ చిన్నారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఎండీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి దీపావళి సందర్భంగా చిన్నారులకు ఆనందాన్ని పంచుతూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది కూడా చిన్నారులకు పటాకులు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి పటాకులు కాలుస్తూ, సరదాగా గడిపి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ“చిన్నారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వుల కంటే విలువైనది మరొకటి లేదు. వారి ఆనందమే నాకు నిజమైన పండుగ. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ఆశ, వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఆనందాన్ని పంచే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎండీఆర్ ఫౌండేష‌న్ తరఫున నిరంతరం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.పటాకులు అందుకున్న చిన్నారులు ఆనందంతో “థాంక్యూ అన్నయ్య హ్యాపీ దీపావళి” అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారుల కేరింతలు, చిరునవ్వుల మధ్య వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.*పండుగల అసలైన స్ఫూర్తి ఆనందాన్ని పంచుకోవడమేనని చాటుతూ, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపే లక్ష్యంతో ఎండీఆర్ ఫౌండేష‌న్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

 

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago