మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆదివారం పటాన్ చెరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.అనంతరం కొల్కురి నరసింహ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది మంది రైతులకు మహిళలకు, పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, ప్రజా అవసరాలను తీరుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, యువరాజ్ మోరే, అక్షిత్, విష్ణు, మల్లేష్, ప్రభాకర్, రతన్ సింగ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…