ఇద్దరూ మృతికి కారణమైన లారీ డ్రైవర్ రిమాండ్…
పటాన్ చెరు:
ఇద్దరు మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండ్ కు తరలించిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి….
హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన నర్సింలు(34), విజయ్(23) ఇద్దరు వారు పనిచేసే సంస్థ పనిపై సంగారెడ్డి వెళ్లి తిరిగి కొండాపూర్ వస్తుండగా పటాన్చెరు మండల పరిధిలోని లక్దారం గేటు సమీపంలో గుర్తుతెలియని లారీ బుధవారం రాత్రి ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. దర్యాప్తులో భాగంగా గుర్తుతెలియని లారీ కోసం గాలించారు. ఈ క్రమంలో లారీ ముత్తంగి ఓవర్ పై నుండి శంషాబాద్ వైపు వెళ్తూ శంషాబాద్ రీలింగ్ ఢీకొట్టింది. దీంతో శంషాబాద్ పోలీసులు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ మహదేవ్ అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించి ఉన్నాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పటాన్చెరువు పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్ తరలించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…