పల్స్‌పోలియో తరహాలోనే కొవిడ్ వ్యాక్సినేషన్…
హైదరాబాద్:
పల్స్‌పోలియో కార్యక్రమం తరహాలోనే కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేసేవిధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.
ఫలితంగా పాజిటివ్ రోగుల నుంచి సాధారణ ప్రజలకు వైరస్ వ్యాపి స్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అంటే. జనం పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిలానే మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నా యని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నేరుగా ప్రజల వద్దకే వ్యాక్సిన్ చేరవేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్, రెడ్డీస్ లాబ్ నుంచి స్పుత్నిక్-ఐ వ్యాక్సిన్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారు అంతా కలిపి దాదాపు 2 కోట్ల మంది ఉంటారని, వారికి రెండు డోస్‌ల టీకాను ఇచ్చేందుకు 4 కోట్ల డోస్‌లు సమకూర్చు కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయాలంటే రాష్ట్ర ప్ర భుత్వంపై రూ.2500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తు న్నారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలతోనే గ్రామస్థాయి వరకు కరోనా వ్యాక్సినేషన్ కూడా నిర్వహించనున్నారు. కాలనీలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు జనం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి టీకా ఇస్తారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…