Telangana

నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి

కార్మిక సంఘాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి ఉరి తాళ్లు అయిన లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ పేర్కొన్నారు. పటాన్ చెరు లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని జరిగిన సదస్సుకు మల్లికార్జున్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు వాటితో కార్మిక వర్గానికి తీవ్రం నష్టమని అన్నారు తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మిక సంఘాల పట్ల చులకన చూడడం కార్మిక సంఘాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి అనడం సరికాదని అన్నారు. కార్మికుల కర్షకుల శ్రమ లేనిదే సంపద అభివృద్ధి లేదని అన్నారు. లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే వాటిని అమలు చేయకుండా కార్మికులను యాజమాన్యాలు తీవ్రమైన శ్రమదోపిడికి పాల్పడ్డాయని అన్నారు. లేబర్ కోడ్స్ తో మరింత శ్రమ దోపిడిని యాజమాన్యాలు పాల్పడడానికి అవకాశం దొరికిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో పాటు రైతు కూలీ ఉద్యోగులకు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు అందులో భాగంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయన్నారు పటాన్ చెరు ప్రాంతంలో కూడా కార్మికుల పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్,పి పాండురంగారెడ్డి, బి నాగేశ్వరరావు సిఐటియు సీనియర్ నాయకులు వాజిద్ అలీ , వివిధ పరిశ్రమల సిఐటియు యూనియన్ నాయకులు విఎస్ రాజు, మణిరాజ్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జయరాం, సుధాకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago