Telangana

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ :

సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న “సమర్థ-శిక్షణ శిబిరం”లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ ,యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.అనంతరం శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం, త్యాగం అనే విలువలపై నిలిచిన శక్తివంతమైన వేదిక అని పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, స్వాతంత్ర్య సమరం నుండి సామాజిక న్యాయం వరకు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.“కాంగ్రెస్ అంటే సేవ సేవ అంటే ప్రజల గెలుపు. ప్రజల పక్షాన పోరాటమే సేవాదళ్ ధర్మం” అని ఆయన పేర్కొన్నారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని బలపరచడం, ప్రతి కార్యకర్తను సేవా దిశగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ శిబిరం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ శిబిరం ద్వారా సేవాదళ్ కార్యకర్తలు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యలపై అవగాహన, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను అలవరుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే వేదికగా ఈ శిక్షణ శిబిరం నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి , శ్రీ సౌందర్య రాజన్ , ప్రణీత్,రత్నాచారి,సేవాదళ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిద్దెల జితేందర్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు మరియు మియాపూర్ యువనాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

21 hours ago