Telangana

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి

శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

క్రికెట్ టోర్నమెంట్ విజేతలు తోషిబా టీం,రన్నర్ సినర్జీ టీం

మేడే సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికులు రోజువారి విధుల్లో మునిగిపోయి ఒత్తిడికి లోనవుతుంటారని అప్పుడప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి అన్నారు.మేడే శ్రామికోత్సవాల సందర్భంగా పాశమైలారం పారిశ్రామిక వాడలోని మార్కెట్ మైదానం లో జరుగుతున్న “మేడే క్రికెట్ టోర్నమెంట్” ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ డిసిఎల్ రవీందర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల రోజువారి విధుల్లో మునిగిపోయి ఒత్తిడికి లోనవుతుంటారు అప్పుడప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమన్నారు. మేడే క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న సిఐటియు కార్మిక సంఘమును ఈ సందర్భంగా అభినందించారు.సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్మికులకు 8గంటల పని హక్కులు కోసం పోరాడిన రోజు అని అన్నారు.

శ్రామికుల శ్రమనే సంపదకు మూలం అని దేశ నిర్మాణంలో శ్రామికుల శ్రమ కీలకపాత్ర పోషిస్తుందని శ్రమ సంస్కృతిని గౌరవిద్దామన్నారు. కార్మికుల హక్కులు భద్రత సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. మేడే సందర్భంగా శ్రామికోత్సవాలు నిర్వహిస్తూ కార్మికులకు కార్మికుల పిల్లలకు క్రికెట్ టోర్నమెంట్ వ్యాసరచన పాటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రామిక శక్తి మేడే ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు.నిర్వాణ కమిటీ కన్వీనర్ కిర్బి జనరల్ సెక్రెటరీ విఎస్ రాజు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం సిఐటియు అన్నారు పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో మేడే సందర్భంగా నిర్వహిస్తున్న శ్రామికోత్సవాలకు కార్మికులు సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, లక్ష్మణ్, శ్యామ్ శ్యాంసుందర్, మహేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, సోమన్న, జైపాల్, సుధాకర్, గోపాల్, భూమేష్, ప్రశాంత్, వెంకటేష్, పెద్దిరాజు, సంతోష్ గౌడ్, శేఖర్ రెడ్డి, మదన్ రెడ్డి, దామోదర్, రోషన్ తోషిబా జనసేన సెక్రెటరీ అనంతరావు, శ్రీధర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago