Andhra Pradesh

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : 

గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ గుంటూరు ప్రజలందరికి హియ్య డైనో మండి గురించి ముందే తెలుసు, హైదరాబాద్ లో చాలా పాపులర్ అని అన్నారు. ఇక్కడ ఫుడ్ చాలా రుచిగా ఉందన్నారు. అందరూ తప్పకుండా వచ్చి ఒక్కసారి ఆ రుచిని చవిచూడాలని పేర్కొన్నారు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ వస్తారు, కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వాతావరణాన్ని బాగా ఇష్టపడతారని పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ ఆహ్లాదారకరమైన వాతావరణంలో ప్రశాంతంగా భోజనం చేసేలా ఉందని తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులకు హియ్య డైనో మండికి స్వాగతం పలికారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులో ప్రారంభించిన హియ్య డైనో మండి రెస్టారెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏషియాలోనే ఫస్ట్ థియేట్రికల్ రెస్టారెంట్ హియా డైనో మండి అని వెల్లడించారు. తక్కువ డబ్బులతో మంచి వాతావరణంలో.. రుచికరమైన భోజనం తినాలి అంటే సరియైన ప్లేస్ లేదని అనిపించి గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను స్థాపించామని తెలిపారు. ఇకపై కుటుంబ సమేతంగా గుంటూరు ప్రజలు వస్తారని, తెలంగాణ, ఆంధ్ర ఏ ప్రాంతం వారైనా గుంటూరుకు వచ్చారంటే హియమండిని సందర్శించండి అని తెలిపారు.

గుంటూరు ఫ్రాంచైస్ ఓనర్ మాట్లాడుతూ గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా ఈ రెస్టారెంట్ డిజైనింగ్ కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు. కానీ ఫైనల్ గా అన్ని విధాల రెస్టారెంట్ అదిరిపోయిందని, ఇక ఫుడ్ విషయంలో టాప్ క్వాలిటీ గా ఉందని తెలిపారు. గుంటూరు ప్రజలు మాత్రమే కాదు గుంటూరుకు వచ్చిన అందరూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పటికీ మర్చిపోరని ఆశాభావం వ్యక్తం చేశారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

42 minutes ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 hour ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

19 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

19 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago