Telangana

అంతర్జాతీయ క్రీడాపోటీలలో రాణించిన గీతం విద్యార్థిని

పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026లో రెండు పతకాలు సాధించిన

బీబీఏ తొలి ఏడాది విద్యార్థి ఆశ్రిత

వియత్నాంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026 పోటీలలో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, బీబీఏ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల రెండు పతకాలు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. 18 ఏళ్ల లోపు విభాగంలో పోటీపడిన ఆశ్రిత, అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, బాలికల సింగిల్స్ లో రజత పతకాన్ని, డబుల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఒక అంతర్జాతీయ క్రీడా పోటీలలో సింగిల్స్, డబుల్స్.. రెండింటిలోనూ పతకాలు సాధించడం ఒక గొప్ప ఘనత. ఇది ప్రపంచ వేదికపై రాణించాలనే ఆమె ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల, సంకల్పానికి నిదర్శనం.

ఆశ్రిత సాధించిన ఈ విజయం ఆమె కఠోర శ్రమ, నిబద్ధత, పికిల్ బాల్ పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనం. ఆమె విజయం, చదువుకు అతీతంగా రాణించడం, సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రాముఖ్యతను కూడా చాటి చెబుతోంది. ఒక అంతర్జాతీయ క్రీడా కార్యక్రమంలో గీతంకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా, ఇతర రంగాలలో రాణించాలని ఆకాక్షించే తోటి విద్యార్థులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.గీతం నాయకత్వం, ఆశ్రిత సాధించిన ఈ అద్భుత విజయానికి అభినందించి, ఆమె అంకితభావం, క్రీడా స్ఫూర్తి, శ్రేష్ఠత పట్ల నిబద్ధతను ప్రశంసించింది. ఆమె మరిన్ని విజయాలను సాధించి, మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ప్రోత్సహించారు.

వియత్నాంలో తన అద్భుతమైన ప్రదర్శనతో, ఆశ్రిత వర్ధమాన యువ క్రీడాకారులకు ఒక గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పింది. అంకితభావం, పట్టుదల, నిరంత కృషితో ఆశయాలను అంతర్జాతీయ వేదికపై విజయాలుగా మార్చుకోవచ్చని ఆమె ప్రస్థానం నిరూపిస్తోంది.

admin

Recent Posts

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

17 minutes ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

6 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

18 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

18 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

19 hours ago

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…

19 hours ago