Telangana

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ఆచరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి డివిజన్ లో విశ్వ భారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ చట్టం తెలియకపోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాకుగా పరిగణించబడదు అని పేర్కొన్నారు. ప్రతి భారతీయ పౌరుడు భారత రాజ్యాంగంలోని పీఠికను అవగాహన చేసుకోవడంతో పాటు, రాజ్యాంగం నిర్దేశించిన విలువలను జీవితంలో ఆచరించాలని సూచించారు. చట్టం యొక్క ఉద్దేశ్యం, సమాజంలో న్యాయ పరిరక్షణలో దాని పాత్రను ప్రతి విద్యార్థి అర్థం చేసుకుని, బాధ్యతాయుతమైన న్యాయవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాఖ డీన్ ఆచార్య ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయ విద్యలో అకాడమిక్ పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని అన్నారు. న్యాయపరమైన వివాదాల పరిష్కారంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం, ఆన్‌లైన్ వివాద పరిష్కార వ్యవస్థ వంటి ఆధునిక విధానాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. అలాగే కరస్పాండెంట్ డాక్టర్ రవి అనంత మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీకృష్ణమ నాయుడు 89వ జన్మదినోత్సవం సందర్భంగా విశ్వ భారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

కళాశాల అభివృద్ధి కోసం చేసిన కృషి, ఎదుర్కొన్న అనుభవాలు, సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విద్యార్థులు నూతన భవనంలో ఏర్పాటు చేసిన ఆధునిక మౌలిక వసతులను సద్వినియోగం చేసుకొని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కృషి, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య ద్వారానే జీవితంలో విజయం సాధించవచ్చని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భవాని, అధ్యాపకులు, పరిపాలనా విభాగం సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన భవన ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

14 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

15 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

19 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

19 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

19 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్…

19 hours ago