Telangana

మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ కు బుద్ది చెప్పుతాం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :

మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా ద్రోహిగా మరిందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మహిళా ఆగ్రహ యాత్ర , కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూమహిళలు, దళితులు, గిరిజనులు చట్టసభల్లో అడుగు పెట్టకుండా కాంగ్రెస్ దశాబ్దాలుగా అడ్డు పడుతోందన్నారు. మహిళలకు రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతో వారసత్వ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని తెలిపారు. ‘ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తుందన్న మహిళల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక తెలంగాణ మహిళల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి, మహిళా బిల్లును అడ్డుకొని పైశాచిక ఆనందం పొందిన విషయాన్ని మహిళా లోకం గమనిస్తోంది. అన్ని విధాల మహిళలను వంచిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మహిళామణులు తగిన బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదు  అని గోదావరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ విజయలక్ష్మి, నాయకురాలు భవాని, రాణి తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

21 hours ago