_బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో.. పటాన్చెరు, రామచంద్రాపురం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మూడు రోజుల తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్షల కార్యక్రమాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్ష సభలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలోనూ పేద బ్రాహ్మణులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాలని వేద బ్రాహ్మణులను కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి దంపతులు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత,…