_అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో సి ఐ టి యూ ను గెలిపించాలీ
_సిఐటియూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
కార్మికుల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడే సిఐటియుని జరగబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియుని గెలిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో వచ్చేనెల 3 న జరిగే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను పురస్కరించుకొని శనివారం పరిశ్రమ ముందు జరిగిన గేట్ మీటింగ్ లో మల్లేశం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి,హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియూ సంఘం అని అన్నారు.రాష్ట్రంలో, జిల్లాలో అనేక పరిశ్రమల్లో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు,ఉద్యోగ భద్రత,సంక్షేమం కోసం పని చేస్తున్న సంఘం సిఐటియూ అని ఆయన అన్నారు.కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వంతో,యాజమాన్యాల తో పోరాడి కార్మికుల కు కార్మిక కుటుంబాలకు కాపాడుకునేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్మికులు ఇతరుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని వచ్చేనెల 3న జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సిఐటియుని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాండురంగారెడ్డి,నర్సింహ్మ రెడ్డి,రాజు, శ్రీనివాస్,రామకృష్ణ, సత్యనారాయణ వివిధ పరిశ్రమల నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…