అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు …
– జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్
పటాన్ చెరు:
అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు.
మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అపార్ట్మెంట్లలో ప్రభుత్వ అనుమతులను సరి చూసుకోని ప్రజలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్ యజమానుల మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, అనుమతి లేని నిర్మాణాలను నిర్మూలించడంలో విఫలమైనందున ఇంద్రేశం, కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలలో ఇలాగే జరిగితే పంచాయతీ పాలకవర్గాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను చేపడితే ఎంతటివారి పైన అయినా క్రిమినల్ కేసులు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అదే విధంగా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో డీఎల్పీఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…