Telangana

బహుళ లక్ష్యాలతో స్పాడెక్స్ మిషన్

నైపుణ్యోపన్యాసంలో పేర్కొన్న ఎన్ఆర్ఎస్ సీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పాడెక్స్ మిషన్ బహుళ లక్ష్యాలతో కూడుకున్నదని, భవిష్య పరిశోధనలకు మరింత ఊతమిచ్చేదని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ యలమంచిలి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్రో సంచలనాత్మక స్పాడెక్స్ మిషన్ తో సంబంధం ఉన్న అనేక సాంకేతిక సవాళ్లను ఆమె వివరించారు.స్పాడెక్స్ మిషన్ కేవలం ఉపగ్రహ ప్రయోగం మాత్రమే కాదని, స్పేస్ డాకింగ్ ప్రయోగంపై దృష్టి సారించిన సమగ్ర చొరవను సూచిస్తోందని పద్మజ ఉద్ఘాటించారు. పలు స్టార్టప్ లు, విశ్వవిద్యాలయాల సహకారంతో మొత్తం 24 పేలోడ్లతో ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే ఉపగ్రహ తనిఖీ, మరమ్మతు, అంతరిక్ష శిథిలాల తొలగింపు, మానవ అంతరిక్ష కార్యక్రమాలు, అంతరిక్ష కేంద్రాల నిర్మాణం, ఫార్మేషన్ ఫ్లయింగ్ తో సహా అనేక క్లిష్టమైన విధులను సులభతరం చేస్తుందన్నారు.

అధునాతన డాకింగ్ మెకానిజమ్స్, సెన్సార్లు, యాక్యుయేటర్లు, ఖచ్చితమైన కక్ష్య నిర్ధారణ అల్గారిథమ్, స్వతంత్ర (అటానమస్) డాకింగ్ అల్గారిథమ్, ఇంటర్-శాటిలైట్ కమ్యూనికేషన్, పవర్ ట్రాన్స్ ఫర్ మెకానిజమ్స్ తో సహా స్పేస్ డాకింగ్ లో చేపట్టే పలు వినూత్న సాంకేతికతలను పద్మజ వివరించారు. అంతరిక్ష వాహక నౌక యొక్క స్వయంప్రతిపత్త డాకింగ్ కోసం రూపొందించబడిన స్వీయ-హోల్డ్ డౌన్ ఫీచర్ తో డ్యూయల్-లివర్ రిజిడైజేషన్ మెకానిజంను కూడా విశదీకరించారు. రెండెజౌస్, డాకింగ్, కాంపోజిట్ కంట్రోల్, అన్ డాకింగ్, నార్మల్ ఫేజ్ ఆపరేషన్ల దశలతో సహా డాకింగ్ టెక్నాలజీ ప్రదర్శనల క్రమాన్ని పద్మజ తెలియజేస్తూ, ఈ ఛేజర్, టార్గెట్ లు రెండేళ్ల పాటు సేవలందించేలా రూపకల్పన చేశారన్నారు. చివరగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను కూడా నివృత్తి చేశారు.

తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అక్తర్ ఖాన్ అతిథిని స్వాగతించి, సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎస్. కిషోర్ కుమార్ వందన సమర్పణ చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

5 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

17 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

17 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

17 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

18 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago