Telangana

నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం

జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ప్రారంభం..

శరవేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయండి..

వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి..

తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఈనెల 20వ తేదీ లోపు బొల్లారం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన రిజర్వాయర్లను ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. జలమండలి అధికారులు, మున్సిపల్ చైర్మన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని ఓఆర్ఆర్ పరిధిలోగల మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు పైప్ లైన్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా బొల్లారం మున్సిపల్ పరిధిలో రెండు మిలియన్ లీటర్ల సామర్థం గల రెండు రిజర్వాయర్లు, పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయని, త్వరలో మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ, లాలాబావి కాలనీ, బంధం కొమ్ము లలో మూడు రిజర్వాయర్లు పూర్తయ్యాయని.. 20వ తేదీ లోపు ప్రారంభిస్తామని తెలిపారు.

బొల్లారం పారిశ్రామికవాడలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం జరిగిందని తెలిపారు. ఓ ఆర్ ఆర్ అవతల బొల్లారం మున్సిపల్ పరిధిలోని నూతన గృహాలకు, అపార్ట్మెంట్లకు సైతం మంచినీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలో అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు మున్సిపాలిటీల నుండి ఐదు కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో కొల్లూరు, ఉస్మాన్ నగర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇప్పటికే 15,000 మంది లబ్ధిదారులు నివసిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా సమస్యలు లేకుండా మంచినీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. నూతన రిజర్వాయర్ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.రాబోయే వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నీటి ఎద్దడి పేరుతో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ శ్రీధర్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, జలమండలి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, డీజీఎంలు చంద్రశేఖర్, శివ, సోమిరెడ్డి, బాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్లు మహదేవరెడ్డి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago