Telangana

యాడ్ ద్వారా వ‌చ్చిన త‌న మొద‌టి రెమ్యూన‌రేష‌న్ ఛారిటీకి ఇచ్చా – సితార ఘట్టమనేని

_హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని

మనవార్తలు ,హైదరాబాద్:

వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమ్రతా ఘట్టమేననితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. తనకు సినిమా అంటే ఇష్టమని సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని అన్నారు. తన అమ్మ నుంచి ఎంతో కాన్ఫిడెన్స్‌ నేర్చుకున్నానని, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మసలుకోవాలో తెలుసుకున్నానని తెలిపారు. తాను నటించిన తొలి యాడ్‌ పీఎంజే జ్యువెల్స్‌ చిత్రాలు, వీడియోలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్‌ టైమ్‌ స్వేర్‌పై రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ దృశ్యాలను తన తండ్రి మహేష్‌బాబు ఎన్నోసార్లు చూసి ఎంతో ఎమోషనల్‌ అయ్యారని చెప్పుకొచ్చారు.

మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారని నమ్రతను ప్రశ్నించగా గౌతమ్‌ ప్రస్తుతం తన చదువుపై ఆసక్తిగా ఉన్నాడని ఆరేడు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి వస్తాడని తెలిపింది. ఈ షార్ట్ ఫిలిం 2023 జూలై 19వ తేదీన అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంజీ జ్యువెల్స్‌ ప్రిన్సిపుల్ డైరెక్టర్, డిజైనర్ దినేశ్ జైన్, డైరెక్టర్ రక్షిత జైన్, నిమేష్, సీమ, శౌర్య, తదితరులు పాల్గొన్నారు. అద్బుత‌మైన డిజైన్స్PMJ జ్యువెల్స్ అద్బుత‌మైన డిజైన్స్ తో స్టార్ సితార క‌లెక్ష‌న్స్ ను రూపొందించిన‌ట్లు నిర్వ‌హ‌కులు తెలిపారు . మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సితార ఘ‌ట్ట‌మ‌నేని, న‌మ్ర‌త ఘ‌ట్ట‌మ‌నేని స‌మాదానాలు ఇచ్చారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago