మనవార్తలు , శేరిలింగంపల్లి :
భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిలు చింతకింది గోవర్ధన్ గౌడ్, వై శ్రీధర్ లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జిల్లా మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…