నైపుణ్యాలు, సృజనాత్మకత వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని చాటిచెప్పిన లలిత, ప్రదర్శన కళల విద్యార్థులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థుల కళా నైపుణ్యాలు, సృజనాత్మక వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని ప్రదర్శించడానికి, వర్ధమాన కళా ప్రతిభకు ఒక వేడుకగా ‘సాధన 2026’ నిలిచింది. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన లలిత, ప్రదర్శన కళల విభాగం శుక్రవారం తమ డాన్స్ స్టూడియోలో సాధన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ఐచ్ఛిక కోర్సులుగా వివిధ విభాగాలను అభ్యసిస్తున్న విద్యార్థులు, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, నాటకం, దృశ్య కళలలో తమ ప్రగతిని తెలియజేశారు. అధ్యాపకుల మార్గదర్శనం, పర్యవేక్షణలో, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, తమ శిక్షణ ద్వారా పెంపొందించుకున్న నైపుణ్యాలు, జ్జానం, కళాత్మక భావాలను ప్రదర్శించారు. ఈ సంగీత ప్రదర్శనలకు మృదంగంపై చంద్రకాంత్, వయోలిన్ పై వాసు శాస్త్రి సహకారం అందించారు.
వాయిద్య సహకారంతో విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమంలోని ఒక ముఖ్యమైన అంశం. ఈ అనుభవం విద్యార్థులకు వేదిక ప్రదర్శనల గురించి విలువైన అవగాహనను అందించడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, సంగీత సమన్వయం, నృత్య ప్రదర్శనలకు తోడుగా పాడటానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది.సాధన 2026, విద్యార్థులు తమ కళాత్మక సామర్థ్యాలను ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు ప్రదర్శించే మొదటి అనుభవాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఇది వారి కళా ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా గుర్తింపు పొందడమే గాక, ఈ కార్యక్రమం వారి మధ్యంతర మూల్యాంకనంలో భాగంగా కూడా ఉంది. ఇది వారి అభ్యసన ఫలితాలు, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, ప్రదర్శన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని అందించింది.
ఇందులో పాల్గొన్న వారి అంకితభావం, ఉత్సాహం, కళాత్మక ఎదుగుదలను ప్రతిబింబిస్తూ, ఈ ప్రదర్శనలు అధ్యాపక బృందం, తోటి కళా విద్యార్థుల నుంచి ప్రోత్సహకరమైన ప్రశంసలను అందుకున్నాయి.మొత్తంగా, సాధన 2026 వివిధ రంగాల అభ్యసనం, సృజనాత్మక అన్వేషణ, వర్ధమాన కళా ప్రతిభకు ఒక వేడుకగా నిలిచింది. అనుభవపూర్వక అభ్యసనం, కళాత్మక సాధన ద్వారా అర్థవంతమైన ప్రదర్శన అవకాశాలను అందించడానికి, తదుపరి తరం కళాకారులను ప్రోత్సహించడానికి గీతం నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది.
రాజకీయ, అధికార, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి నూతన వధూవరులకు ఆశీస్సులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు…
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ - న్యాయం జరిగే వరకు పోరాటం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా…
యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…
రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…