Telangana

మంగత్రాయ్36 లో ది జ్యువెలరీ సెలూన్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభించిన సుధారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36, లో గల మంగత్రాయ్36 లో ఫిలాంథ్రోపిస్ట్ , కళలు, ఫ్యాషన్ రంగాలపై విశేష అభిరుచి కలిగిన సుధారెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రముఖురాలు బాబీ కంధారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపావళి, ధన్తేరస్ పండుగలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల ప్రదర్శన అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది. సంప్రదాయ కళానైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ రూపొందించిన అద్భుతమైన ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ సందర్భంగా మంగత్రాయ్36 డైరెక్టర్ మధుర్ గుప్తా మాట్లాడుతూ  భారతీయ ఆభరణాల గొప్ప వారసత్వం, నైపుణ్యంతో కూడిన కళాత్మక పనితనం, మారుతున్న ఆధునిక డిజైన్ అభిరుచులను ప్రతిబింబించేలా ‘ది జ్యువెలరీ సెలూన్’ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు, సున్నితమైన పనితనంతో రూపొందించిన బంగారు హారాలు, సంప్రదాయ కుందన్, పోల్కీ ఆభరణాలతో పాటు ప్రత్యేకమైన డిజైనర్ ఆభరణాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.రోజువారీ వినియోగానికి అనువైన సొగసైన ఆభరణాల నుంచి వధువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వైభవోపేతమైన ఆభరణాల వరకు విభిన్న శ్రేణులను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. సంప్రదాయ శైలి, ఆధునిక అభిరుచులు, ప్రత్యేక సందర్భాలకు తగిన డిజైన్లతో ఈ కలెక్షన్లు ఆభరణాల ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

admin

Recent Posts

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…

2 hours ago

డిమాండ్ల వ్యక్తీకరణ కోసం ఉద్యమాలు

గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల…

2 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

1 day ago

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మైలాన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర…

1 day ago

మహనీయుల బోధనలను యువతకు చేరవేయాలి : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్..

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్…

1 day ago

ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి…

1 day ago