గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల ఉద్యమాలు కుల వ్యతిరేక, స్త్రీవాద, నల్లజాతి చైతన్య ప్రసంగాల ద్వారా చట్టపరమైన, సామాజిక గుర్తింపు కోసం తమ డిమాండ్లను వ్యక్తీకరిస్తాయని అమెరికాలోని టఫ్ట్స్ విశ్వ విద్యాలయ సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో విజిటింగ్ ఫెలో డాక్టర్ సోనాల్ శర్మ అభిప్రాయపడ్డారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన కేంద్రం (సీఏఎస్) యొక్క పట్టణీకరణ, లింగం, శ్రమ (యూజీఎల్) క్లస్టర్ ఉపన్యాస శ్రేణిలో భాగంగా ‘ఇళ్ల నుంచి వీధుల వరకు: భారతదేశం, దక్షిణాఫ్రికాలో గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణ’ అనే అంశంపై గురువారం ఆతిథ్య ఉపన్యాసాన్ని నిర్వహించారు.డాక్టర్ సోనాల్ శర్మ తన విస్తృతమైన క్షేత్ర పరిశోధన ఆధారంగా, శ్రమ, వర్గం, కులం, జాతి, లింగం యొక్క పరస్పర సంబంధాలను అన్వేషించారు. ఈ అంశాలు హక్కులు, గుర్తింపు కోసం గృహ కార్మికుల పోరాటాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రముఖంగా ప్రస్తావించారు. కార్మిక ఉద్యమాలను తీర్చిదిద్దడంలో, గౌరవం, న్యాయం, సామాజిక భద్రత కోసం వారి డిమాండ్లను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం, కార్మిక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీవో) పాత్రలను కూడా ఆయన పరిశీలించారు.ఆంగ్లం, ఇతర భాషల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, యూజీఎల్ క్లస్టర్ సమన్వయకర్త డాక్టర్ దేబాద్రితా చక్రవర్తి, మీడియా స్టడీస్-విజువల్ కమ్యూనికేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుసాన్ కోషి ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…
రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర…
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి…