Telangana

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామానికి చెందిన పటాన్చెరు పాపయ్య, భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన పసుపుల విక్రంలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి పాపయ్యకు ఒక లక్ష 25 వేల రూపాయలు, విక్రమ్ కు ఒక లక్ష 50 వేల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మంగత్రాయ్36 లో ది జ్యువెలరీ సెలూన్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభించిన సుధారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…

2 hours ago

డిమాండ్ల వ్యక్తీకరణ కోసం ఉద్యమాలు

గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల…

2 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

1 day ago

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మైలాన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర…

1 day ago

మహనీయుల బోధనలను యువతకు చేరవేయాలి : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్..

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్…

1 day ago

ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి…

1 day ago