Telangana

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మైలాన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ఆరోపించారు. బుధవారం పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం తీవ్రంగా వేధింపులకు పాల్పడుతు కార్మికులను తొలగిస్తూ రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి చట్టం ప్రకారం బోనస్ ఇయల్స్ గ్రాట్యుటీ రావలసిన సౌకర్యాలు ఇవ్వడం లేదన్నారు. సేఫ్టీ యూనిఫామ్, షూ, క్యాంటీన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడుతూ కార్మికుల పొట్టలు కొడుతున్న మైలాన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిశ్రమ ముందు ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

1 hour ago

మహనీయుల బోధనలను యువతకు చేరవేయాలి : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్..

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్…

1 hour ago

ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి…

1 hour ago

శ్రీనివాస కాలనీ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.50 లక్షలు

-అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ -17వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా -కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్…

1 day ago

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం

ప్రభుత్వం స్పందించకపోతే లక్ష మందితో హైదరాబాద్ లో భారీ నిరసన పటాన్‌చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ…

1 day ago

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల…

1 day ago