-అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్
-17వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
-కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్
-అభివృద్ధికి సహకరిస్తున్న చైర్‌పర్సన్‌కు కృతజ్ఞతలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు శ్రీనివాస కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.50 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్, స్థానిక కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్‌తో కలిసి పనులను ప్రారంభించారు. కాలనీలో చాలాకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఈ పనులు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.శ్రీనివాస కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్ మాట్లాడుతూ వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.వార్డు అభివృద్ధికి సహకరిస్తూ,డ్రైనేజీ పనుల ప్రారంభానికి తోడ్పడిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డీఈ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నరసింహారెడ్డి, సంపత్, రాఘవేందర్, గోపాల్‌రెడ్డి, సందీప్, నారాయణదాస్, మణి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, శ్రీనివాస కాలనీవాసులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే లక్ష మందితో హైదరాబాద్ లో భారీ నిరసన పటాన్‌చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ…
సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల…
తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని…
ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిట్కుల్…
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా…