పటాన్ చెరు జోన్ ఇంచార్జ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు వెంకటేష్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు పటాన్ చెరు జోన్ ఇంచార్జ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రమోద్ కుమార్, సంజీవ్ రావు, గీత శేఖర్, సతీష్, నగేష్, వాసు, సదాశివ రావు, ట్రస్మా రాష్ట్ర అడ్వైజర్ పూసల లింగాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, జిల్లా సెక్రటరీ ఆంథోనీ రెడ్డి, ట్రెజరర్ డి.నాగేశ్వర్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలాస్, విద్యాభారతి కార్యనిర్వాహక కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ఐఎంసిటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి హాజరవుతారన్నారు. పటాన్ చెరులో వారు మాట్లాడుతూ నైతిక విద్యా బోధనలతో విద్యార్థుల్లో మార్పునకు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలోనే రోజువారి బోధనలో భాగంగా విలువలను విద్యార్థులకు అందించడం, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా వారి ఆలోచన విధానం, పరివర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు అని తెలిపారు. విలువల ఆధారిత విద్యకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.
ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిట్కుల్…
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా…
ఇన్స్పైర్ మనక్ జాతీయ పోటీల్లో సంగారెడ్డి విద్యార్థుల ఘన విజయం అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక త్వరలోనే రాష్ట్రపతి భవన్కు…
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలో మత సామరస్యానికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ప్రాంతాల సమగ్ర…
సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం.. పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ…
మూడు ప్రత్యేక విభాగాల ద్వారా విద్యార్థులకు కెరీర్ మద్దతును బలోపేతం చేస్తుంది పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రోజురోజుకూ మారిపోతున్న…