Telangana

బాంబే కాలనీలో కలుషిత నీటి సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలన

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈరోజు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా బాంబే కాలనీలో ఇంటింటికీ వెళ్లి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించిన అనంతరం, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాత రామచంద్రాపురంలో జరుగుతున్న రెండు నీటి మరమ్మతు పనులతో పాటు, వాసవి నగర్ కాలనీలో యూజీడీ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) సమస్యను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు వస్తోందని స్థానిక నివాసితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, బీడీఎల్ అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలుస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి, కలుషిత నీటి సరఫరాకు కారణమైన లోపాన్ని సరిచేసి, కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. అలాగే యూజీడీ, నీటి మరమ్మతులకు సంబంధించిన సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాధ్ రెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

చిట్కుల్ 7వ వార్డులో పార్కులు, రహదారుల స్థలాలను కాపాడాలి నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిట్కుల్…

45 minutes ago

విద్యార్థుల ఆవిష్కరణలకు జాతీయ గుర్తింపు

ఇన్స్‌పైర్ మనక్ జాతీయ పోటీల్లో సంగారెడ్డి విద్యార్థుల ఘన విజయం అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక త్వరలోనే రాష్ట్రపతి భవన్‌కు…

2 hours ago

గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలో మత సామరస్యానికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ప్రాంతాల సమగ్ర…

2 hours ago

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ…

3 hours ago

గీతం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

మూడు ప్రత్యేక విభాగాల ద్వారా విద్యార్థులకు కెరీర్ మద్దతును బలోపేతం చేస్తుంది పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రోజురోజుకూ మారిపోతున్న…

3 hours ago

ఘనంగా జరిగిన ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకలు

‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ద్వారా సుమ కనకాల గారు చేస్తున్న సేవలు అభినందనీయం: ఉపాసన కామినేని కొణిదెల మనవార్తలు ప్రతినిధి…

1 day ago