తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక
అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఎన్.సి.సి. క్యాడెట్లు మరోసారి తమ సత్తా చాటారు. అఖిల భారత అంతర్-డైరెక్టరేడ్ డ్రోన్ పోటీ 2026లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (ఏపీ&టీ) డైరెక్టరేట్ కు ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు ఎంపికయ్యారు. తమిళనాడులోని తిరుచెంగోడ్ లో గల కె.ఎస్. రంగస్వామి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (కేఎస్ఆర్సీటీ)లో ఈనెల 23 నుంచి నవంబర్ 4 వరకు జరుగుతున్న పోటీలలో వీరు పాల్గొంటున్నారు.ఈ జాతీయ స్థాయి పోటీకి తెలంగాణ నుంచి కేవలం నలుగురు క్యాడెట్లు మాత్రమే ఎంపికవగా, వారిలో ఇద్దరు గీతం హైదరాబాద్ ఎన్.సి.సి. విద్యార్థులు కావడం గమనార్హం. ఎంపికైన క్యాడెట్లు- జూనియర్ అండర్ ఆఫీసర్ ఎ.అభినవ్ సాయి కార్తీక్ (సీనియర్ డివిజన్), జూనియర్ అండర్ ఆఫీసర్ తమ్ములూరి కావ్య (సీనియర్ వింగ్). వారి ఎంపిక డ్రోన్ కార్యకలాపాలలో వారి అంకితభావం, సాంకేతిక నైపుణ్యం, కృషి, ప్రతిభ, నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.గీతం అసోసియేట్ ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీలో మా క్యాడెట్లు డైరెక్టరేట్ కు ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. వారి విజయం గీతం హైదరాబాదు ప్రోత్సాహాన్ని చాటిచెప్పడమే గాక, తోటి క్యాడెట్లు సాంకేతిక ఆవిష్కరణలను స్వీకరించి, ఎన్.సి.సి. కార్యకలాపాలలో రాణించడానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’ అని అన్నారు.గీతం హైదరాబాదు ఉన్నతాధికారులు కూడా ఈ ఇద్దరు క్యాడెట్ల అద్భుతమైన విజయాన్ని అభినందించి, వారు ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి, మరిన్ని విజయాలను అందుకోవాలని అభిలషించారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని…
ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిట్కుల్…
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా…
ఇన్స్పైర్ మనక్ జాతీయ పోటీల్లో సంగారెడ్డి విద్యార్థుల ఘన విజయం అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక త్వరలోనే రాష్ట్రపతి భవన్కు…
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలో మత సామరస్యానికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ప్రాంతాల సమగ్ర…
సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం.. పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ…