Telangana

పాటి వార్డు కార్యాలయం కేటాయింపు పై గ్రామస్తుల ఆగ్రహం

– నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

– న్యాయం జరిగే వరకు పోరాటం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా అవసరాల కోసం నిర్మించిన వార్డు కార్యాలయాన్ని నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కార్యాలయానికి కేటాయించడం పై ముత్తంగి డివిజన్‌ పాటి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక నాయకులు వార్డు కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించిన వార్డు కార్యాలయాన్ని గ్రామస్తుల ప్రయోజనాలకే వినియోగించాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వార్డు కార్యాలయం కేటాయింపు పై అధికారులు పునరాలోచించాలని కోరారు.ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. సమస్యను రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని వెల్లడించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మణ్‌, స్వామి గౌడ్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా…

13 hours ago

పటాన్‌చెరులో నేషనల్ ఆటోమొబైల్ షాప్ ప్రారంభం

యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ…

13 hours ago

మంగత్రాయ్36 లో ది జ్యువెలరీ సెలూన్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభించిన సుధారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…

1 day ago

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…

1 day ago

డిమాండ్ల వ్యక్తీకరణ కోసం ఉద్యమాలు

గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల…

1 day ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్..

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

2 days ago