పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. గత నాలుగు రోజులుగా డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ పైప్ లైన్ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా క్లీన్ చేయకపోవడంతో రోడ్డుపై ప్రవహించడంతోపాటు దుర్వాసన రావడంతో పాఠశాలకు వచ్చే వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సరైన స్పందన రావడం లేదని ఆరోపించారు. ఒక పాఠశాల పరిసరాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కాలనీలో పరిస్థితి ఎలా ఉందో అధికారులు ఆలోచించాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ఇప్పటికైనా తక్షణం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆయన కోరారు.
యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…
రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…
గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర…