రాజకీయ, అధికార, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి నూతన వధూవరులకు ఆశీస్సులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.శుక్రవారం ఉదయం గూడెం సందీప్ రెడ్డికి ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి కుమార్తె హర్ష్యతి తో నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి, ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్ రెడ్డి, హర్ష్యతి దంపతులను ప్రముఖులు ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
నైపుణ్యాలు, సృజనాత్మకత వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని చాటిచెప్పిన లలిత, ప్రదర్శన కళల విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల…
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ - న్యాయం జరిగే వరకు పోరాటం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా…
యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు…
రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు…