Telangana

ఉస్మాన్ నగర్ బీఈమ్యాక్ సొసైటీ ప్రజలకు ఇంప్రూవ్మెంట్ చార్జీలు తగ్గించండి

జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం :

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో గల బిహెచ్ఇఎల్ బీఈమ్యాక్ సొసైటీ కాలనీవాసులకు మంచినీటి కనెక్షన్ల కోసం వసూలు చేస్తున్న ఇంప్రూవ్మెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ జలమండలి ఎండి అశోక్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.సోమవారం హైదరాబాద్లోని జలమండలి కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జలమండలి ద్వారా చేపడుతున్న మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, నూతన కనెక్షన్లపై చర్చించారు. ప్రధానంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో బిహెచ్ఎల్ పరిశ్రమలో విధులు నిర్వర్తించి.. రిటైర్మెంట్ అయిన అనంతరం బిఈమెక్ సొసైటీ పేరుతో గృహాలను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల మంచినీటి కనెక్షన్ల కోసం జలమండలికి దరఖాస్తు చేసుకోగా.. మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని ఇందులో 64 లక్షల రూపాయలు ఇంప్రూవ్మెంట్ చార్జీలు కట్టాలని నోటీసులు అందజేశారని తెలిపారు. ఇప్పటికే మూడు కోట్ల రూపాయలను డిడి రూపంలో జలమండలికి చెల్లించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కాలనీలో అత్యధిక శాతం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు నివసిస్తున్నారని ఇంప్రూవ్మెంట్ చార్జీలు చెల్లించే ఆర్థిక పరిస్థితులు వారికి లేవని ఆయన తెలిపారు. మానవత దృక్పథంతో ఇంప్రూవ్మెంట్ చార్జీలను రద్దుచేసి నల్ల కనెక్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి అతి త్వరలో వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు ఉమేష్, బీఈమ్యాక్ అధ్యక్షులు సంజీవ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మాధవరావు, సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ప్రతినిధులు వాసుదేవరావు, సందీప్ రెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago