Telangana

రవికుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన బాయిని మహేష్ యాదవ్ దంపతులు

మన వార్తలు, శేరిలింగంపల్లి :

హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో, మసీద్‌బండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కాంటెస్టేడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంఘ నాయకులు, బీజేపీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రవి కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కేక్ కట్ చేసి సంబరాలు జరుపగా, నాయకులు పూలమాలలు వేసి ఆయనను సన్మానించారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రవి కుమార్ యాదవ్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న అంకితభావం కలిగిన నాయకుడని కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బోయిని అనూష మహేష్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ బలోపేతానికి రవి కుమార్ యాదవ్ సేవలు అమూల్యమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago