సిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు,శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి పాండురంగారెడ్డి
విప్లవోద్యమ యోధుడు, నిరాడంబర జీవనానికి ప్రతిక
శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
కార్మిక,రైతంగా హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప నేత పుచ్చలపల్లి సుందరయ్య అనిసిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు,శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి పాండురంగారెడ్డి కొనియాడారు. మంగళవారం పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో గల శాండ్విక్ పరిశ్రమలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత,భారత జాతీయోద్యమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నా రు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు, శాండ్విక్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి పాండురంగారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అలగానిపాడు గ్రామంలో 1918 మే 1న భూస్వామ్య కుటుంబంలో పుచ్చలపల్లి జన్మించారన్నారు. ఆయన అసలు పేరు సుందర రామిరెడ్డి అని ఆ పేరును త్యజించి సుందరయ్యగా మార్చుకున్నారని చెప్పారు. కందుకూరి, గురజాడ వంటి సాహితి వేత్తల ప్రభావం తో పెంపొందించుకున్న పుచ్చలపల్లి 14వ ఏటనే మద్రాస్ కాంగ్రెస్ సభలో పాల్గొన్న ఆయన సైమాన్ కమిషన్ ను బహిష్కరిస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ రైతంగ పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప నాయకుడు అన్నారు ప్రజలే ప్రాణంగా, ఉద్యమమే ఊపిరిగా ఆశయాలే గీటురాయిగా కడదాకా కమ్యూనిస్టు యోధుడిగా అందరికీ ఆదర్శ ప్రాయుడని ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ఆఫీస్ బేరర్స్, కమిటీ సభ్యులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…