Telangana

మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కు వినతి పత్రం అందజేత

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ జీవో 69 ప్రకారం కనీస వేతనం 16,600 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి పనుల మీద విచ్చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వా మి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గం లోని ఇంద్రేశం మున్సిపల్ లో పనిచేస్తున్న 75 మంది కార్మికులకు మున్సిపల్ ఏర్పడి పది నెలలు గడుస్తున్నా కేవలం గ్రామపంచాయతీ వేతనాలతోనే మున్సిపల్ అధికారులు సరిపెడుతున్నారని ఆరోపించారు. కనీస వేతనం 16,600 వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఏర్పడ్డప్పటినుండి కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే సబ్బు, నూనే ,టవల్స్, బెల్లం తదితర వస్తువులు పది నెలలు గడుస్తున్నా నేటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. జిన్నారం మున్సిపల్ లో గత ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, జిన్నారం మున్సిపల్ ఏర్పడ్డప్పటినుండి నేటికీ యూనిఫాం, ఐడి కార్డులు, ఇతర చట్టపరమైన సౌకర్యాలు ఏ ఒక్కరికి మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్లకు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అనేక సందర్భాల్లో విన్నవించడం జరిగిందన్నారు.ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పోచయ్య, నర్సింలు, మల్లేష్, వెంకటేష్, శ్రీనివాస్, సుధాకర్, అనిత, గండయ్య, సాయి, జిన్నారం నాయకులు శ్రీశైలం, శేఖర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago