హైదరాబాద్:
తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా హోస్ లో అగుగుపెట్టింది.
ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ సింహాద్రి తమన్నాని షో లో కి తీసుకొచ్చారు నిర్వహకులు. అయితే ఆమె ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయారు. దీంతో ఈ సీజన్లో పింకీ రావడం.. ఎవరు ఊహించని రీతిలో 90రోజుల పాటు హౌస్లోలో ఉండి ప్రేక్షకులను అలరించింది. తమన్నాకు పూర్తి భిన్నంగా అందరితో కలిసిపోయి ఆకట్టుకుంది.అటు షో లో ప్రియాంక ఎక్కువగా మానస్‌కు దగ్గరగా ఉండేది. అతడికి అవసరమైన సేవలన్నింటినీ చేసేది.తనని ఎవరైనా నామినేట్ చేస్తే, తిరిగి వారిని నామినేట్ చేయటం, వారిపైన అరవడం చేసేది.
వరెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చినా తట్టుకోలేకపోయేది. ఎవరైనా కౌంటర్ ఇస్తే కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చేది. ఏ చిన్న టాస్క్ జరిగినా ఎక్కువ మందిని కార్నర్ చేసేది కాదు. అయితే ఇన్ని రోజుల జర్నీలో ప్రియాంక ఒక్క టాస్క్‌లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఒక్క సూపర్ విలన్స్, సూపర్ హీరోస్ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థి సభ్యులు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది. కానీ, కెప్టెన్ కాలేకపోయింది. మొత్తంగా ట్రాన్స్ జెండర్గ్గా ప్రియాంక 90 రోజుల పాటు హౌస్ లో ఉండి ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం సామాన్య విషయం కాదంటున్నారు అభిమానులు. షో నుంచి బయటకి వచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…