పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పాఠ్యాంశాలను మొక్కుబడిగా చదివి ఉత్తీర్ణులవడం కంటే ఆచరణాత్మక అనుభవాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు మిన్న అని, ఆచరణాత్మక అనుభవమే ప్రగతికి సోపానంగా ఎన్ఐటీ వరంగల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ పాండా అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో ‘5జీ నెట్ వర్క్ లో వికేంద్రీకృత కంప్యూటర్ ఇన్ ఫ్రాస్టక్చర్ సాధికారత గల వాహన తాత్కాలిక నెట్ వర్క్ పాత్రపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.వాహనాల చలనానికి సంబంధించిన సవాళ్లు, పరిష్కారాలు, 5జీ నెట్ వర్క్, ధరల విధానం కోసం వినియోగించే అల్గోరిథం గురించి డాక్టర్ పాండా వివరించారు. ఫాగ్ నోడ్స్ (ఎఫ్ఎన్) ద్వారా శక్తి వినియోగాన్ని తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఈ అతిథ్య ఉపన్యాసంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని, 5జీ నెట్ వర్క్ ల అభివృద్ధిలో ఫాగ్-సాధికారత వాహనాల తాత్కాలిక నెట్ వర్క్ పాత్రపై పలు విషయాలను తెలుసుకున్నారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్‌చెరు శాసన…
పటాన్‌చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్‌చెరు…