సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం
స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి
నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం
మనవార్తలు ప్రతినిధి ,సంగారెడ్డి :
ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూపచ్చటి పొలాలు మూడు పంటలు పండే భూములు స్వచ్ఛమైన గాలి అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న కొంగత్త ఆశలతో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారు అన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశమైలారం, పటాన్‌చెరు , జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండి గూడెం, దయరా గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు కెమికల్స్, మెడిసిన్స్, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ప్రతి సంవత్సరం తమ లాభాల్లో 0.5 శాతం డబ్బులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అకౌంట్లో జమ చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణకు ఆదేశాలు సైతం జారీ చేసిందన్నారు.2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలు అందిస్తున్న సి.ఎస్.ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని వివరించారు.నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశంతో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు .
ప్రతి రోజు కాలుష్య జలాలు విష వాయువులతో జీవనం కొనసాగిస్తున్న పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు అందిస్తున్న సిఎస్ ఆర్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాము. గత రెండున్నర సంవత్సరాలుగా సి ఎస్ ఆర్ నిధులు లేకపోవడం మూలంగా అభివృద్ధి కుంటూ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్చెరు నియోజకవర్గం నుండి చెల్లిస్తున్న సి ఎస్ ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలని.. లేని పక్షంలో ప్రజల నిరసనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…