Telangana

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల :

గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నెంబరు 109 లో పరిశ్రమల స్థాపన కోసం భూములు అందించిన ప్రతి రైతుకు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని కోరుతూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ తో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సర్వే నెంబర్ 109లో గల సుమారు 160 ఎకరాల భూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం సేకరించిన సమయంలో రైతులకు నష్టపరిహారంతో పాటు ప్రతి ఒక్కరికి వంద గజాల నివాస స్థలం ఇస్తామని అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి సమక్షంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న నేటి వరకు ప్లాట్ల కేటాయింపు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాట్ల కోసం ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించిన విషయాన్ని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే ఆ స్థలాన్ని కూడా పరిశ్రమలకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలు తీసుకుంటే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్లాట్ల కేటాయింపును త్వరితగతిన చేయాలని కోరారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, వెంకట్రంరెడ్డి, హుస్సేన్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago