బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతన చర్చి ప్రారంభం..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతనంగా నిర్మించిన చర్చిని శుక్రవారం ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో చర్చిల నిర్మాణాలు దోహదపడతాయని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ప్రేమ, దయ, క్షమాపణ మరియు నిస్వార్థ సేవలను నేర్పుతున్నాయని తెలిపారు. సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా 30 పైగా చర్చిలు నిర్మించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నూతన చర్చి నిర్మాణానికి సైతం ప్రభుత్వంతో చర్చించి భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. చర్చి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చర్చి ఫాదర్ ఆండ్రూస్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…